VIDEO: నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లో మంచు కనువిందు

AKP: నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లో మంగళవారం ఉదయం మంచు కనువిందు చేసింది. ఉదయం ఎనిమిది గంటల వరకు మంచు ప్రభావం కనిపించింది. దీంతో వాహనదారులు తమ రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. కొందరు లైట్లు వేసుకొని ప్రయాణించాల్సి వచ్చింది. ముఖ్యంగా ధర్మసాగరం, జోగినాధుని పాలెం ప్రాంతాల్లో మంచు దట్టంగా కురిసింది. శీతాకాలం మొదలుకాకముందే ఇలా ఉందంటే ఇక శీతాకాలం వచ్చాక ఎలా ఉంటుందో అని వాపోతున్నారు.