VIDEO: భక్తులతో కిక్కిరిసిన వెంకన్న ఆలయం

CTR: పుంగనూరు పట్టణంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. శ్రావణమాస మూడో శనివారం సందర్భంగా శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా వచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఉత్సవమూర్తులను అద్దాల మండపంలో కొలువు తీర్చారు.