VIDEO: మొక్కజొన్న సంచులు మాయం.. రైతుల నిరసన

VIDEO: మొక్కజొన్న సంచులు మాయం.. రైతుల నిరసన

NRML: కుంటాల మండలంలోని వెంకూరు గ్రామంలో రైతు నారాయణకు చెందిన మొక్కజొన్న సంచులు రాత్రి దొంగతనానికి గురవడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఆగ్రహించిన రైతులు, స్థానిక నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. బాధితుడికి న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గబోమని హెచ్చరించారు. దొంగలను తక్షణమే పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు.