ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజావాణి
WNP: ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్‌తో కలిసి అర్జీలు స్వీకరించారు. ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి నిర్దిష్ట కాల పరిమితిలో పరిష్కరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.