సాగర్‌కు భారీ వరద.. 20 గేట్లు ఓపెన్‌

సాగర్‌కు భారీ వరద.. 20 గేట్లు ఓపెన్‌

NLG: నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు చేరింది. దీంతో అధికారులు 20 క్రస్ట్‌గేట్లను 5 అడుగులు పైకి ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 1,94,886 క్యూసెక్కులుగా ఉంది. జల విద్యుత్‌ కేంద్రంలో ఉత్పత్తి యథావిధిగా కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.