పోలీస్ వాహనానికి నిప్పు.. పరిస్థితి ఉద్రిక్తం

పోలీస్ వాహనానికి నిప్పు.. పరిస్థితి ఉద్రిక్తం

బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీస్ వాహనం ఢీకొని ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో స్థానికులు ఆందోళనకు దిగారు. కోపోద్రిక్తులైన ఆందోళనకారులు పోలీస్ వాహనానికి నిప్పుపెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. వెంటనే అప్రమత్తమైన గోపాల్‌గంజ్ ఎస్పీ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి  ఆందోళనకారులతో చర్చలు జరిపారు.