ఈనెల 25న రాష్ట్ర కేబినెట్ భేటీ

ఈనెల 25న రాష్ట్ర కేబినెట్ భేటీ

TG: రాష్ట్ర కేబినెట్ భేటీ ఈనెల 25న మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికను ప్రవేశపెట్టే తేదీలపై చర్చించి, తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. హైకోర్టు సూచనల మేరకు నివేదికను సభలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో పాటు బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, బడ్జెట్ ప్రతిపాదనలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.