పోలీస్ గ్రీవెన్స్‌కు 98 అర్జీలు

పోలీస్ గ్రీవెన్స్‌కు 98 అర్జీలు

ATP: అనంతపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఇవాళ నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో ఎస్పీ పి.జగదీష్ 98 అర్జీలు స్వీకరించారు. బాధితుల సమస్యలను స్వయంగా విన్న ఆయన, వాటిని చట్టపరిధిలో త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఇస్కాన్ సహకారంతో అర్జీదారులకు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత భోజన వసతి కల్పించారు.