ఇండస్ట్రియల్ హబ్‌గా ఏలూరు పార్లమెంట్
ఏలూరు పార్లమెంట్‌ను ఇండస్ట్రియల్ హబ్‌గా మారుస్తామని ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ యువత ఏపీలోనే ఉద్యోగాలు చేసుకునేలా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తూ ముందుకు వెళుతుందని, దీని ద్వారా ఇతర దేశాల వారు మన రాష్ట్రంలో పనిచేస్తారని తెలిపారు. సీఎం చంద్రబాబును చూసే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయన్నారు.