'ప్రభుత్వ వైఫల్యంతోనే యూరియా కొరత'

'ప్రభుత్వ వైఫల్యంతోనే యూరియా కొరత'

VZM: ప్రభుత్వ వైఫల్యంతోనే యూరియా కొరత ఏర్పడిందని ఎమ్మెల్సీ సురేష్ బాబు అన్నారు. సోమవారం గజపతినగరం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బెల్లాన జ్ఞాన దీపిక అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. కూటమి ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని తెలిపారు. ఇందులో జడ్పీటీసీ గార తవుడు ఏఎంసీ ఛైర్మన్ గోపాలరాజు పాల్గొన్నారు.