VIDEO: సరస్వతి హత్య ఘటనలో కీలక విషయాలు

VIDEO: సరస్వతి హత్య ఘటనలో కీలక విషయాలు

NTR: విజయవాడలో భర్త విజయ్ తన భార్య సరస్వతిని నడిరోడ్డుపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు.  సరస్వతి, విజయ్ 2022 ఫిబ్రవరి 14న ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. సరస్వతి వీన్స్ ఆసుపత్రిలో నర్స్‌గా, విజయ్ శ్రేయాస్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. అయితే భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానించి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిసింది.