కొడుకు మరణాన్ని తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య

కొడుకు మరణాన్ని తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య

VZM: రామభద్రపురం మండలం జన్నివలస గ్రామానికి చెందిన పతివాడ కొత్తయ్య(65) తన కుమారుడి మరణాన్ని జీర్ణించుకోలేక పురుగుల  మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కొత్తయ్య కుమారుడు కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా అప్పటి నుంచి మద్యానికి బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.