విషాదం.. నీటి బకెట్లో పడి రెండేళ్ల చిన్నారి మృతి

విషాదం.. నీటి బకెట్లో పడి రెండేళ్ల చిన్నారి మృతి

MBNR: భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఇంద్రానగర్‌లో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. మహమూద్ కుమార్తె జువేరియా (2) ఇంటి ముందు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి బకెట్లో పడి మృతి చెందింది. తల్లిదండ్రులు ఇంట్లో పనిలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. చిన్నారి ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది.