అమరచింతలో ఘనంగా మేడే ఉత్సవాలు

WNP: మేడే సందర్భంగా అమరచింత మండల కేంద్రంలో సీపీఎం ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సీపీఎం మండల కార్యదర్శి చంటి జండా ఆవిష్కరణ చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నేతలు వెంకటేష్, రాఘవేందర్ మాట్లాడుతూ.. హక్కుల కోసం పోరాడి పోలీసుల తూటాలకు బలైన కార్మికుల జ్ఞాపకార్థమే మేడే అని అన్నారు.