చెత్త సేకరణ పై ప్రత్యేక దృష్టి

చెత్త సేకరణ పై ప్రత్యేక దృష్టి

AKP: కోటవురట్ల మండలంలో చెత్త సేకరణపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు ఎంపీడీవో చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం జల్లూరు గ్రామంలో పారిశుధ్యం పరిశుభ్రత కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. గ్రామాల్లో చెత్త కుప్పలు ఎక్కడా కనిపించకూడదన్నారు. చెత్తను ఎప్పటికప్పుడు సంపద కేంద్రాలకు తరలించాలన్నారు. మురికి కాలంలో శుభ్రం చేసి బ్లీచింగ్ వేయాలన్నారు.