అంకాళమ్మ ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం

అంకాళమ్మ ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం

TPT: తిరుపతిలోని అంకాళమ్మ ఆలయ నూతన పాలకమండలి శనివారం ప్రమాణ స్వీకారం చేసింది. ఛైర్మన్‌గా కొండా రాజ్ మోహన్, సభ్యులుగా మరో ఎనిమిది మంది బాధ్యతలు స్వీకరించారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఎన్డీఏ కూటమి నాయకుల సమక్షంలో ఆలయ ఈవో మునిశంకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎమ్మెల్యే, పాలకమండలి సభ్యులు అమ్మవారిని దర్శించుకున్నారు.