'వినియోగదారులలో ఆందోళన తొలగించాలి'
PPM: పార్వతీపురంలో ఉన్న HPగ్యాస్ ఏజెన్సీని బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు సందర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. జిల్లాలో గ్యాస్ కొరత లేకుండా చూడాలన్నారు. అలాగే, గ్యాస్ వినియోగదారులలో ఆందోళన ఉన్న నేపథ్యంలో సందేహాలను అధికారులు నివృత్తి చేయాలని, గ్యాస్ బ్లాక్ మార్కెట్ జరగకుండా పర్యవేక్షణ చేయాలని డిమాండ్ చేశారు.