సరస్వతి పుష్కరాల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

PDPL: భూపాలపల్లి జిల్లా కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రంలోని త్రివేణి సంగమం వద్ద పవిత్ర సరస్వతి పుష్కర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ మహోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు.