'రైతులకు సాగునీరు అందించే దిశగా పోరాటం చేస్తాం'

BDK: జిల్లా రైతాంగానికి సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను అందించే దిశగా పోరాటం చేస్తామని CPM కమిటీ సభ్యులకు పొతినేని సుదర్శన్ తెలిపారు. శనివారం CPM జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముగ్గురు మంత్రులు జిల్లాలోని రైతులకు సాగు జలాలు అందించకుండా మోసం చేస్తున్నారని, వారికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామని అన్నారు.