ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం

JN: దేవరుప్పుల మండల వ్యాప్తంగా బుధవారం ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో పత్తి, వరి రైతులు పంట నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది పూర్తిగా నష్టపరిచే వర్షమే అని దీంతో ఎలాంటి లాభం లేదని పలువురు రైతులు వాపోతున్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.