రేపు జిల్లాలో ఉద్యోగ మేళా

MBNR: పట్టణంలోని జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో ఈనెల 12న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి జానీపాషా తెలిపారు. SSC పాస్ లేదా ఫెయిల్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ డిప్లొమా, బీటెక్ చదివి 18 నుంచి 40 ఏళ్లలోపు వయస్సు గల అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి ఉన్నవారు విద్యార్హత ధ్రువపత్రాలు, బయోడేటాతో శుక్రవారం హాజరు కావాలన్నారు.