గ్యాస్ కొరత అపోహలను నమ్మవద్దు: అదనపు కలెక్టర్
NRPT: వంట గ్యాస్ కొరతపై అపోహలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అదనపు కలెక్టర్లు ఫణీందర్ రెడ్డి, శ్రీను పాల్గొన్నారు. గ్యాస్ సరఫరాపై తక్షణం సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి, ప్రజలకు నిరంతర సరఫరా అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.