దశవతార గణపతులను దర్శించుకున్న ఎమ్మెల్యే

VZM: బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన మంగళవారం స్దానిక చీపురుపల్లి వీధిలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దశావతార గణపతులను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ AMC ఛైర్మన్ పువ్వల శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు ఘన సన్మానం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దశావతార గణపతుల రూపకల్పన ఎంతో వైభవంగా, ఆకర్షణీయంగా ఉందని ప్రశంసించారు.