'గ్రంథాలయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి'
CTR: పుంగనూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రంథాలయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని వైస్ ప్రిన్సిపల్ రాజశేఖర్ సూచించారు. ఈ మేరకు పుస్తక పఠనం ద్వారా విజ్ఞానం పెంపొందుతుందని చెప్పారు. ఈ సందర్భంగా లైబ్రేరియన్ నిర్మల ఆధ్వర్యంలో ప్రత్యేక పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు.