ఇందిరమ్మ ఇళ్ల పనులు పరిశీలించిన డీసీసీ ప్రెసిడెంట్
MDCL: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల పనులను డీసీసీ ప్రెసిడెంట్ తోటకూర వజ్రెష్ యాదవ్ పరిశీలించారు. 26వ డివిజన్ పరిధిలో మొత్తం 29 మందికి ఇందిరమ్మ ఇళ్లను కేటాయించారు. ఈ నేపథ్యంలో నాణ్యతతో కూడిన నిర్మాణాలు నిర్మించుకోవాలని, ప్రభుత్వం దశలలో సహాయం చేస్తుందని బెనిఫిషరీలకు ఆయన సూచించారు.