ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన కాంగ్రెస్ నాయకులు
MNCL: హిందూ దేవతలను కించపరిచారని ఆరోపిస్తూ CM రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసిన BJP నాయకులపై కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు గురువారం బెల్లంపల్లి కాంగ్రెస్ కార్యాలయం వద్ద PM నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. నాయకులు మాట్లాడుతూ.. మతం పేరుతో రాజకీయాలు చేస్తున్న ప్రధాని మోడీ, రాష్ట్ర BJP నాయకులకు ప్రజలు తగిన బుద్ది చెబుతారన్నారు.