సుబ్బారాయుడి ఆలయానికి భక్తుల తాకిడి
W.G: పెంటపాడు మండలం పడమర విప్పర్రు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి షష్టి సందర్భంగా బుధవారం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయం నుంచి రహదారి వరకు క్యూలైన్లలో బారులు తీరి కనిపించారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. స్వామివారిని మొక్కుకుంటే కోరిన కోరికలు తీరతాయని భక్తుల విశ్వాసం. ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.