టెంపుల్ టూరిజం అభివృద్ధికి కృషి
E.G: బిక్కవోలు, గొల్లలమామిడాడలో పురాతన ఆలయాలను టెంపుల్ టూరిజంతో అభివృద్ధి చేసే దిశగా ముందుకు వెళ్తున్నామని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయం వద్ద తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు, టూరిజం శాఖ అధికారులతో ఆయన మంగళవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు.