VIDEO: అకాల వర్షంతో తడిసిన ధాన్యం

VIDEO: అకాల వర్షంతో తడిసిన ధాన్యం

SDPT: హుస్నాబాద్‌లో మంగళవారం వేకువ జామున ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. అకస్మాత్తుగా కురిసిన ఈ వర్షం కారణంగా హుస్నాబాద్ మార్కెట్ యార్డులో రైతులు ఆరబోసిన మొక్కజొన్నలు తడిసిపోయాయి. సోమవారం సాయంత్రం కాటా వేసిన మొక్కజొన్న సంచులు కూడా పూర్తిగా తడవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనాలని కోరారు.