నేడు మండలంలో పర్యటించనున్న ఎమ్మెల్యే
TPT: సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఇవాళ తడ మండలంలో పర్యటించనున్నారు. కారూరులో హెల్త్ క్లినిక్‌కు శంకుస్థాపన, తడ సచివాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. తడ కండ్రిగలో సచివాలయ భవన ప్రారంభోత్సవంతోపాటు లబ్ధిదారులకు CMRF చెక్కులు పంపిణీ చేయనున్నారు. MPDO కార్యాలయంలో సోలార్ ప్యానెల్స్, స్వచ్ఛ రథాలను ప్రారంభించి అభివృద్ధి పనులకు ఊతమిస్తుందన్నారు.