స్కూల్ బస్ డ్రైవర్ మృతి.. నిందితుడిని గుర్తించరా..!
MBNR: అయిజ మాలపేట కాలనీకి చెందిన స్కూల్ బస్ డ్రైవర్ వీరేష్ మృతి చెంది పది రోజులు గడిచినా ఇంతవరకు కారకులైన వారిని గుర్తించకపోవడం బాధాకరమని స్కూల్ బస్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. వీరేష్ మృతికి కారణమైన వ్యక్తిని, వాహనాన్ని తక్షణమే గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ, మంగళవారం స్థానిక ఎస్సై శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు.