తీవ్ర విషాదం.. విద్యుత్ వైరు తగిలి రైతు మృతి

తీవ్ర విషాదం.. విద్యుత్ వైరు తగిలి రైతు మృతి

SRPT: నాగారం మండలం నాగారం బంగ్లాలో విద్యుత్ వైరు తగిలి రైతు మృతి చెందిన ఘటన గురువారం జరిగింది. నాగారం బంగ్లాకి చెందిన యాదయ్య (55) తన వ్యవసాయ పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లి తెగిపోయి పొలంలో పడ్డ విద్యుత్ వైరు కాళ్లకు తాకి విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.