స్టీల్ ప్లాంట్ కోసం జగన్ ఏంచేశారు?: కేంద్రమంత్రి
AP: కేంద్ర ప్రభుత్వానికి విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించే ఉద్దేశం లేదని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ పునరుద్ఘాటించారు. పరిశ్రమ కోసం రూ.11 వేల కోట్ల ప్యాకేజీ ఇచ్చిన తర్వాత కూడా ప్రైవేటికరణ అంటూ దుష్ప్రచారం చేయడం విచారకరమన్నారు. ఇక మాజీ CM జగన్ తన పాలనలో విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఏం చేశారని ప్రశ్నించారు. కడపలో ప్లాంట్ ఏర్పాటు చేయలేకపోయారని ఎద్దేవా చేశారు.