VIDEO: సిద్దిపేటలో అగ్నిమాపక వారోత్సవాలు
SDPT: సిద్దిపేట ఫైర్ స్టేషన్లో అగ్నిమాపక సేవల వారోత్సవాలు మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అగ్నిమాపక శకటాలతో పట్టణంలో ర్యాలీ నిర్వహించి, ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ నెల 20 వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించడంలో అగ్నిమాపక సిబ్బంది పోషిస్తున్న కీలక పాత్రను ఈ సందర్భంగా వారు గుర్తుచేశారు.