VIDEO: గొర్లవీడులో సీసీ కెమెరాల ప్రారంభం

BHPL: భూపాలపల్లి జిల్లా గొర్లవీడు గ్రామంలో రూ. 2.50 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన నూతన సీసీ కెమెరాలను గురువారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు. అనంతరం MLA మాట్లాడుతూ.. గ్రామ దాతల సహకారంతో స్థాపించిన 20 సీసీ కెమెరాలు నేరాల నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన తెలిపారు. శాంతిభద్రతలు పటిష్టంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.