VIDEO: మిర్చియార్డు ప్రత్యామ్నాయ రహదారి అధ్వాన్నం
గుంటూరు మిర్చియార్డు వద్ద అభివృద్ధి పనుల వల్ల ఏర్పడిన ప్రత్యామ్నాయ రహదారి గుంతలతో అధ్వాన్నంగా మారింది. ఇది నల్లపాడు, పేరేచర్ల, సత్తెనపల్లి, నర్సరావుపేట వైపు వెళ్లే ప్రధాన మార్గం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ ఉదయం ఈ దారిలో ఒక ట్రాక్టర్ బోల్తా పడింది. వెంటనే అధికారులు స్పందించి రహదారి మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.