యువజన ఉత్సవాలను ప్రరారంభించిన కలెక్టర్
నిర్మల్ ఎన్టీఆర్ మినీ స్టేడియంలో గురువారం జిల్లా స్థాయి యువజన ఉత్సవాలను కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యువజన ఉత్సవాలు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ, నాయకత్వ గుణాలను వెలికితీయడంలో దోహదపడతాయని పేర్కొన్నారు. యువత స్వామి వివేకానంద ఆలోచనలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.