ఉగ్రదాడిపై చిదంబరం సంచలన వ్యాఖ్యలు

ఉగ్రదాడిపై చిదంబరం సంచలన వ్యాఖ్యలు

దేశీయ ఉగ్రవాదం గురించి పహల్గామ్ ఉగ్రదాడి ముందు, తర్వాత చెప్పానని కేంద్ర మాజీమంత్రి చిదంబరం తెలిపారు. అప్పుడు తనను అందరూ ఎగతాళి చేశారని అన్నారు. దేశీయ ఉగ్రవాదులు ఉన్నారని కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలుసని అందుకే తను మాట్లాడినప్పుడు మౌనంగా ఉందని తెలిపారు. దేశ పౌరులను, విద్యావంతులను ఉగ్రవాదులుగా మార్చే పరిస్థితులు ఏంటి? అని ప్రశ్నించుకోవాలని పేర్కొన్నారు.