ఇద్దరు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు
PPM: 'ముస్తాబు' కార్యక్రమం నిర్వహణలో అలసత్వం చూపిన కురుపాం ఆదర్శ పాఠశాలలోని ఇద్దరు ఉపాధ్యాయులకు డీఈవో బీ.రాజ్ కుమార్ మంగళవారం షోకాజ్ నోటీసులు అందజేశారు. కలెక్టర్ పాఠశాలను శనివారం సందర్శించిన సమయంలో ప్రొటోకాల్ పాటించకపోవడం, విద్యార్థుల వ్యక్తి గత పరిశుభ్రత నిర్వహణలో లోపాలు, కలెక్టర్ మాట్లాడేందుకు సిద్ధం చేసిన సభాస్థలి అస్తవ్యస్తంగా ఉండటంతో షాకాజ్ నోటీసుల ఇచ్చారు.