ఖమ్మం ఐటీ హబ్ ను మరింత విస్తరించాలని మంత్రికి వినతి
KMM: ఖమ్మం ఐటీ హబ్‌ను మరింత విస్తరించి, ఫేజ్-II ను మంజూరు చేయాలని కోరుతూ రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు తుమ్మల యుగంధర్ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ఫేజ్-11 ను త్వరగా ప్రారంభించాలని వారు మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఐటీ అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.