VIRAL: పంది పిల్లకు పాలిచ్చిన శునకం

VIRAL: పంది పిల్లకు పాలిచ్చిన శునకం

కర్నూలు జిల్లా కౌతాళం మండలంలోని కామవరంలో వింత ఘటన వెలుగు చూసింది. తల్లి లేని ఓ వరాహానికి శునకమే కన్నతల్లి అయింది. ఆకలితో ఉన్న ఆ పంది పిల్లకు పాలిచ్చి అక్కున చేర్చుకుంది. ఈ ఘటనను చిత్రీకరించిన వ్యక్తి నెట్టింట్లో పెట్టడంతో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు అమ్మతనంలో ఉన్న గొప్పతనం ఇదేనంటూ కామెంట్లు పెడుతున్నారు.