VIDEO: తమ ఇంటిపై జాతీయ జెండా ఎగరవేసిన ఎమ్మెల్యే
E.G: ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు అనపర్తి మండలం రామవరం లో తమ ఇంటిపై బుధవారం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా జాతీయ జెండాకు గౌరవ వందనం చేశారు.