ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

NLG: చందంపేట ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర డాక్టర్, వైద్య సిబ్బందితో మాట్లాడి మండలంలో మాతా శిశు మరణాల వివరాలను  తెలుసుకున్నారు. మహిళల్లో రక్తహీనత, వైద్య చికిత్సలు, తన వివరాలను సైతం అడిగారు.. కలెక్టర్ వెంట ఆర్డీవో రమణారెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.