నల్గొండలో సీతారాం ఏచూరి వర్ధంతి

నల్గొండ పాత బస్తీలో సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతిని సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి స్థానిక నాయకులు, కార్యకర్తలు పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన దేశానికి, కార్మిక వర్గానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు దండంపల్లి సత్తయ్య, కార్మికులు పాల్గొన్నారు.