ప్రజలు ఫిర్యాదులు లిఖితపూర్వకంగా అందజేయాలి: కలెక్టర్

ప్రజలు ఫిర్యాదులు లిఖితపూర్వకంగా అందజేయాలి: కలెక్టర్

BDK: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు సకాలంలో హాజరు కావాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదివారం ప్రకటించారు. ప్రజలు తమ సమస్యలు లిఖితపూర్వకంగా రాసి ఫిర్యాదులు అందజేయాలని తెలిపారు. ఉదయం 10:30 గంటలకు ప్రజావాణి కార్యక్రమం ప్రారంభం అవుతుందని అన్నారు.