పుట్లంపల్లెను అభివృద్ధి చేయాలి: సీపీఎం

కడప: నగరంలోని 15వ డివిజన్ పరిధిలో ఉన్న పుట్లంపల్లెను సీపీఎం కార్యదర్శి రామమోహన్ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ నెలకొన్న సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. పుట్లంపల్లె పంచాయతీ కార్పొరేషన్లో విలీనం చేస్తే అభివృద్ధి జరుగుతుందన్నారు. సంవత్సరాలు గడిచినా పన్నుల భారం పెరిగిందే తప్ప అభివృద్ధి ఛాయలు కనపడటం లేదని విమర్శించారు.