VIDEO: పెద్దముప్పారం రోడ్డు బంద్

MHBD: దంతాలపల్లి మండలం పరిధిలోని పెద్ద ముప్పారం గ్రామ సమీపంలో ఉన్న వాగు, రోడ్డు పై నుంచి ఉప్పొంగి ప్రవహిస్తుంది. దీంతో ఇప్పటికే వాగు పరిసర ప్రాంతాలలో ఉన్న పొలాలు నీట మునిగాయి. దంతాలపల్లి, పెద్ద ముప్పారం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అటువైపుగా ఎవరు వీళ్లొద్దని, అందరూ జాగ్రత్తగా ఉండాలని అధికారులు స్థానికంగా సూచించారు.