పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్
VSP: జీవీఎంసీ 38వ వార్డు సీతారామ ఆలయ వీధిలో సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ చేతులు మీదుగా పలువురు లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పరిపాలన అందిస్తుందన్నారు. త్వరలో నూతన పెన్షన్లు అందిస్తామన్నారు. ఆయన వెంట కార్పొరేటర్ నరసింహాచారి విజయలక్ష్మి, కూటమి నాయకులు ఉన్నారు.