'చలో హైదరాబాదును విజయవంతం చేయాలి'

'చలో హైదరాబాదును విజయవంతం చేయాలి'

మెదక్: బోధన్ పట్టణంలోని మహాలక్ష్మి కళ్యాణ మండపంలో నిజామాబాద్ జిల్లా మాల మహానాడు నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలోని జింఖానా గ్రౌండ్‌లో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా డిసెంబర్ 1న నిర్వహించనున్న మాలల సింహ గర్జనకు మాలలు పెద్ద ఎత్తున తరలి రావాలన్నారు. ఈ సమావేశంలో నాయకులు అలుక కిషన్, ఉదయ్ కుమార్, దేవిదాస్, నాగరాజు పాల్గొన్నారు.