‘మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండాలి’
VZM: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని కొత్తవలస మండల తహసీల్దార్ రమాలక్ష్మి మండలంలో ఉన్న మహిళలకు మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ప్రతి మహిళ వంట గదికి పరిమితం కాకుండా బాగా చదువుకుని సొంతకాళ్ల మీద నిలబడి, అన్ని రంగాల్లో మగవారితో సమానంగా ముందు ఉండాలని హితవు పలికారు. ప్రభుత్వం మహిళలకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తుందని గుర్తు చేశారు.